ePaper
More
    Homeక్రైంHyderabad | హైదరాబాద్​లో డ్రగ్స్​ దందా.. 8 మంది అరెస్ట్

    Hyderabad | హైదరాబాద్​లో డ్రగ్స్​ దందా.. 8 మంది అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​, గంజాయి మాఫియాలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా నగరంలో డ్రగ్స్​ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్​, గంజాయి దొరుకుతుండడంతో పలువురు వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

    డ్రగ్స్​ నిర్మూలనే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police), స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ (STF) ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల పలువురు నిందితులను అరెస్ట్​ చేసినా.. దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా బెంగళూరు (Bengaluru) నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న ఎనిమిది మందిని స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

    హైదరాబాద్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు రెండు వేర్వేరు చోట్ల దాడులు చేసి మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు బెంగళూరు నుంచి ఎండీఎంఏ (MDMA) తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వీరితో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని కూడా అరెస్ట్​ చేశారు. మొత్తం 6.34 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ధూల్‌పేటలోని బలరామ్‌గల్లి ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో 1.248 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఇందులో ఒక మహిళా కూడా ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...