అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా బుధవారం నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 6.03 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదలైనట్లు పేర్కొన్నారు. ప్రజలు, పశువుల కాపరులు ప్రధాన కాల్వలోకి వెళ్లవద్దని, రైతులు నీటిని తూముల ద్వారా మళ్లించవద్దని ఆయన కోరారు.
