More
    Homeభక్తిAmarnath Yatra | భ‌ద్ర‌తా దృష్ట్యా.. అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు

    Amarnath Yatra | భ‌ద్ర‌తా దృష్ట్యా.. అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో ‘నో ఫ్లై జోన్’ విధింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)కి వెళ్లి ఆ మంచు లింగాన్ని దర్శించుకోవాల‌ని ఎంతో మంది యాత్రికులు ఆరాట‌ప‌డుతుంటారు. ఏటా వేలాది మంది యాత్రికులు(Travelers) ఇక్క‌డికి తరలివస్తుంటారు.

    అయితే, ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన‌డంతో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం (Jammu Kashmir Government) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 1 నుంచి పహల్గామ్‌, బల్టల్‌ మార్గాలపై ‘నో ఫ్లై జోన్‌’ విధించనున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. యాత్రికుల భద్రత కోణంలో ఇది అత్యంత కీలక చర్యగా అధికారులు చెబుతున్నారు.

    Amarnath Yatra | యాత్రికుల భ‌ద్ర‌త కోసం..

    కేంద్ర హోంశాఖ (MHA) సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. పహల్గామ్‌, బల్టల్‌ యాత్ర మార్గాల్లో డ్రోన్లు, యూఏవీలు (UAVs), గాలిపటాలు సహా వైమానిక వస్తువుల ఉపయోగాన్ని పూర్తిగా నిషేధించారు. భద్రతా విభాగాలు, వైద్య అవసరాల కోసం ఉపయోగించే హెలికాప్టర్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (Lieutenant Governor) ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్‌ మార్గం నుంచి కాలినడకన లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని తెలిపింది.

    ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు హిమాలయాల్లో (Himalayas) జరిగే వార్షిక అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనబోతున్న నేపథ్యంలో, భద్రతా విభాగాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో, యాత్ర మార్గాల్లో ఎలాంటి వైమానిక కదలికలను అనుమతించరాదన్నదే ఈ నిషేధం ఉద్దేశ్యం. డ్రోన్‌లను వాడుకుని ఉగ్రమూకలు ప్రమాదం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల రక్షణే లక్ష్యంగా నో ఫ్లై జో న్(No fly zone) విధిస్తున్నామని.. ఇది భద్రతా ప్రోటోకాల్‌లో భాగమని అధికారులు స్పష్టం చేశారు.

    More like this

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్రప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే మంజూరు...

    Clear Tax | క్లియర్‌టాక్స్ ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు

    అక్షరటుడే, హైదరాబాద్ : Clear Tax | దేశంలో పన్నుల దాఖలుకు సంబంధించిన ప్రముఖ వేదికైన క్లియర్‌టాక్స్, తమ...

    Makloor | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఇద్దరి దుర్మరణం

    అక్షరటుడే, ఆర్మూర్​: Makloor | మాక్లూర్​ మండలంలోని దుర్గానగర్​ తండా (Durga nagar Thanda)​ వద్ద ఘోర రోడ్డు...