ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | త్రివేణి సంగమం వద్ద భద్రతను పెంచండి: సీపీ ఆదేశం

    CP Sai Chaitanya | త్రివేణి సంగమం వద్ద భద్రతను పెంచండి: సీపీ ఆదేశం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | రెంజల్​ పోలీస్​స్టేషన్ (Renjal Police station)​ పరిధిలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సీపీ సాయి చైతన్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన త్రివేణి సంగమాన్ని (Triveni sangamam) సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

    అనంతరం సీపీ మాట్లాడుతూ.. నదీ పరీవాహక ప్రాంతాల్లో మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు రానున్నందున భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. నదిలో స్నానమాచరించేందుకు యువత ఉత్సాహం చూపుతారని వారికి నీటి ప్రవాహంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సంగమం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ల వద్ద బారికేడ్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు (Bodhan Rural Inspector Vijay Babu), రెంజల్ ఎస్సై చంద్ర మోహన్​ ఉన్నారు.

    More like this

    Chhattisgarh | చత్తీస్​గఢ్​లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్​గఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి దుర్మరణం

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...