- Advertisement -
HomeUncategorizedEarthquake | ఈక్వడార్​ భూకంపం.. ధ్వంసమైన భవనాలు, పలువురికి గాయాలు

Earthquake | ఈక్వడార్​ భూకంపం.. ధ్వంసమైన భవనాలు, పలువురికి గాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake : ఈక్వడార్(Ecuador) దేశంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.3 గా నమోదైంది. భూకంప దాటికి ఈస్మెరాల్డాస్ పోర్టు నగరంలో కనీసం 20 మందికి గాయాలు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

యూరోపియన్ మెడిటరేనియన్ సెస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఈ భూకంపం శుక్రవారం ఈక్వడార్ తీరానికి సమీపంలో భూమి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూ ప్రకంపనల వల్ల ఇళ్లు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేయబడింది. చమురు మౌలిక సదుపాయాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

భూకంపం ఏర్పడిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నొబోఆ మాట్లాడుతూ, “మంత్రులందరిని బాధిత ప్రావిన్స్‌కు పంపిస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోయినవారికి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తామని, సహాయ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ” తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News