ePaper
More
    HomeజాతీయంVande Bharat Train | వ‌చ్చే నెల నుండి అందుబాటులోకి వందే భార‌త్ స్లీప‌ర్ ట్రైన్స్.....

    Vande Bharat Train | వ‌చ్చే నెల నుండి అందుబాటులోకి వందే భార‌త్ స్లీప‌ర్ ట్రైన్స్.. లోపల సౌకర్యాలు అదుర్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Vande Bharat Train | దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు(Vande Bharat Train) సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్‌ను తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి కాగా, త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) నుంచి వందే భారత్ స్లీపర్స్ పరుగులు తీయనున్నాయి. ఢిల్లీ నుండి సికింద్రాబాద్ రూట్‌లో ఒక ట్రైన్ తిర‌గ‌నుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper Train) ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగపూర్, బల్హార్షా, కాజిపేట్ జంక్షన్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

    Vande Bharat Train | స్లీప‌ర్ ట్రైన్స్..

    రాత్రి 8:50 గంటలకు న్యూఢిల్లీ(New Delhi) నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. థర్డ్ ఏసీ: రూ 3600, సెకండ్ ఏసీ: రూ 4800, ఫస్ట్ ఏసీ: రూ 6000గా ఉంటుంది. ఇక విజయవాడ – బెంగళూరు స్లీపర్ రైలు ప్రయాణ మార్గం విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు (Bangalore) వరకు ఈ వందే భారత్ స్లీపర్ రైలు సేవలు అందించనుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వెర్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రైలు లోపల సౌకర్యాలు చూస్తే వావ్ అనాల్సిందే. అంతేకాదు ఇకపై రైలు ప్రయాణం అద్భుతంగా మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

    నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ లోపలి సౌకర్యాలు, ఇంటీరియర్, బెడ్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టైలిష్ బెడ్లు(Stylish beds), స్మార్ట్ లైటింగ్(smart lighting), సెల్ఫ్ కంట్రోల్ సీటింగ్ సిస్టమ్(self-control seating system), నిశబ్ద ప్రయాణానికి ప్రత్యేక డిజైన్ ఇలాంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే.. మనం రైల్లో ఉన్నామా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలగడం ఖాయం. ప్రస్తుతం చైర్‌కార్ వేరియంట్ లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి సాధారణంగా రోజు వేళ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు.. రాత్రి పూట ప్రయాణించే వారికి సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. వచ్చే నెల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం కానుండ‌గా, వాటిలో ప్ర‌యాణించేందుకు ప్ర‌యాణికులు ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...