ePaper
More
    Homeఅంతర్జాతీయంTrump warns Khamenei | నిన్ను చంపడం చిటికెలో పని.. ఖమేనీకి ట్రంప్​ వార్నింగ్​

    Trump warns Khamenei | నిన్ను చంపడం చిటికెలో పని.. ఖమేనీకి ట్రంప్​ వార్నింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump warns Khamenei: ఇజ్రాయిల్ – ఇరాన్ పరస్పర భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్​కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

    ట్రూత్ సోషల్ పోస్టు(Truth social post)లో “ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ(Iran’s Supreme Leader Ali Khamenei)ని అంతమొందించడానికి నేను చర్యలు తీసుకోను.. అమెరికా ఖమేనీని హత్య చేయగలదు.. అది చిటికెలో పని.. కానీ, ప్రస్తుతానికి అలా చేయడం లేదు” అని ట్రంప్​ అన్నారు. “షరతులు లేకుండా లొంగిపోండి” అంటూ ఖమేనీకి గట్టి హెచ్చరిక జారీ చేశారు.

    ఖమేనీని అంతమొందించకపోవడానికి ఒకే ఒక్క కారణం.. అమెరికా పౌరులు, దళాలపై ప్రతీకార దాడులు నిరోధించడానికే అని ట్రంప్​ అన్నారు. “సుప్రీం లీడర్’ అని పిలవబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో తమకు కచ్చితంగా తెలుసని ట్రంప్​ చెప్పుకొచ్చారు. అతను తమకు సులభమైన లక్ష్యం, కానీ మేము అతన్ని చంపబోము. ప్రస్తుతానికి అలా చేయము” అని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్​లో పేర్కొన్నారు. “మేము పౌరులపై క్షిపణులు ప్రయోగించాలని కోరుకోవడం లేదు. ఎంతో ఓపికతో ఉన్నాం” అని పోస్టు పెట్టారు.

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...