అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | న్యాయం చేయాలని కోరుతూ సీపీ కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలితో సీపీ సాయిచైతన్య మాట్లాడారు. తక్షణమే న్యాయం చేయాలని ఆర్మూర్ ఎస్సైని (Armoor Si) ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన యాదమ్మపై పాతకక్షలను మనసులో పెట్టుకుని బంధువులు దాడి చేశారు. దీంతో ఆమె నేరుగా మంగళవారం సీపీ కార్యాలయానికి చేరుకుంది. దీంతో సీపీ తన కారులో కార్యాలయం లోపలికి వెళ్తూ.. ఆ వృద్ధురాలిని చూసి కారు దిగి వృద్ధురాలి సమస్యను విన్నారు. వెంటనే ఆర్మూర్ ఎస్సైకి ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు.
