అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Sakhi Center |నగరంలోని సఖి కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గృహహింస, చీటింగ్ కేసు బాధితులతో మాట్లాడారు. అలాగే 181 కాల్స్ డాష్ బోర్డ్, మిషన్ శక్తి డాష్ బోర్డ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం సేవలను కొనియాడారు. బాధిత మహిళలకు అన్నిరకాలుగా అండగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీ, తెలంగాణ విమెన్ కమిషన్ సభ్యులు సూదం లక్ష్మి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.