అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad | జిల్లా కోర్టు (District Court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ కేసులో వీడీసీ సభ్యులు (VDC Members) 16 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్‌పల్లి (Jakranpalli) మండలం మునిపెల్లి గ్రామంలో 2021లో రోడ్డు విషయమై ఎస్టీ కులానికి చెందిన తుమ్మ రవీందర్, అతని కులసభ్యులను వీడీసీ సభ్యులు సంఘ బహిష్కరణ చేశారు. దీంతో 16 మంది వీడీసీ సభ్యులపై అప్పట్లో కేసు నమోదు కాగా, మంగళవారం జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో ఈ మేరకు జడ్జి టి శ్రీనివాస్ 16మంది వీడీసీ సభ్యులకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. వీడీసీ అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. గ్రామాల్లో వీడీసీ వేధింపులకు గురైతే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన విచారణ అధికారి, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్, కోర్టు కానిస్టేబుల్ అధికారి కిషోర్‌ను సీపీ అభినందించారు.