ePaper
More
    HomeతెలంగాణTelangana | అక్కడ తెలంగాణ వాసులున్నారా..? రాష్ట్ర సర్కారు సాయం ఇదిగో.. ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌

    Telangana | అక్కడ తెలంగాణ వాసులున్నారా..? రాష్ట్ర సర్కారు సాయం ఇదిగో.. ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana : ఇరాన్(Iran) – ఇజ్రాయెల్(Israel) దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లోని తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ(Delhi)లోని తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని(special helpline center) ప్రారంభించింది.

    విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs), రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి అందిన తాజా వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్లు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు సీఎంవో ప్రకటించింది.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంవో వెల్లడించింది.

    Telangana : సహాయం అవసరమైన వారు ఈ కింది నెంబర్లను సంప్రదించవచ్చు

    ▪️వందన, పీఎస్, రెసిడెంట్ కమిషనర్: +91 9871999044

    ▪️ జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్: +91 9643723157

    ▪️ జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్: +91 9910014749

    ▪️ సీహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి: +91 9949351270

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...