ePaper
More
    Homeఅంతర్జాతీయంAsim Munir | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్​కు భంగపాటు.. అగ్రరాజ్యంలో పాక్ పౌరుల నుంచే...

    Asim Munir | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్​కు భంగపాటు.. అగ్రరాజ్యంలో పాక్ పౌరుల నుంచే నిరసన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Asim Munir | అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్​కు(Pakistan Army Chief Asim Munir) తీవ్ర పరాభవం ఎదురైంది. అగ్రరాజ్యంలో సొంత దేశస్తుల నుంచే నిరసన ఎదురైంది. వాషింగ్టన్(Washington)లో బస చేస్తున్న హోటల్ ఎదుట కొందరు పాకిస్తానీయులు ఆందోళనకు దిగారు. మునీర్ హంతకుడని, పిరికివాడని, నియంత అని నినాదాలు చేశారు. పాకిస్తాన్ లో మునీర్ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఉండదని, వేలాది మంది పాక్ ప్రజల మరణాలకు ఆయనే కారణమని మండిపడ్డారు. దేశంలో తుపాకులు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం చనిపోతుందంటూ నినాదాలు చేశారు.

    Asim Munir | మునీర్​కు వ్యతిరేకంగా..

    వ్యూహాత్మక పర్యటన కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే, అమెరికాలో ఆయనకు పాక్ పౌరుల నుంచే నిరసన సెగ తగిలింది. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ పీటీఐకి చెందిన కార్యకర్తలు మునీర్ బస చేసిన హోటల్ వెలుపల నిరసనలు చేపట్టారు. “అసిమ్ మునీర్, మీ సమయం ముగిసింది. పాకిస్తాన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని” నినాదాలు చేశారు. “అసిమ్ మునీర్, నువ్వు దాక్కోవచ్చు, నువ్వు రెండవ బేస్మెంట్లో కింద ఉన్నావు. నిన్ను వేటాడేందుకు జనాలు ఇక్కడ ఉన్నారు” అని పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...