ePaper
More
    HomeజాతీయంAadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    Aadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Aadhaar Updation | దేశంలో ప్రస్తుతం ఆధార్​ కార్డు (Aadhar card) ఎంతో కీలకం. అన్నింటికీ ఆధార్​ తప్పనిసరి. పాఠశాలలో ప్రవేశాల నుంచి మొదలు పెడితే పాస్​పోర్టు వరకు ఆధార్​కార్డు ఉంటేనే సాధ్యం. అంతేగాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆధార్​ కార్డు ఉంటేనే అందుతాయి. అయితే ఆధార్​కార్డులో తప్పులు ఉన్నవారు ఇన్నిరోజులు వాటిని సరి చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడేవారు. అయితే కేంద్రం తాజాగా అలాంటి వారికి శుభవార్త చెప్పింది. ఇక ఇంట్లో నుంచే ఆధార్​ కార్డు అప్​డేట్​ చేసుకోవచ్చని తెలిపింది.

    Aadhaar Updation | ఓటీపీ ద్వారా అప్​డేట్​

    ఆధార్​ కార్డును ఇక ఇంట్లో నుంచే అప్​డేట్​ చేసుకోవచ్చు. ఓటీపీ (OTP) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. గతంలో ఆధార్​కార్డు పొందిన వారిలో చాలా మందికి పుట్టిన తేది, ఇంటి పేరు, పేర్లు తప్పులుగా నమోదు అయ్యాయి. దీంతో వీరు ఆధార్​ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం పుట్టిన తేది, ఇంటి పేరు, పేరు మార్పు లాంటి వివరాలను ఇంటి నుంచే అప్​డేట్ (Aadhaar Update)​ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల క్రితం ఆధార్​ పొంది.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్​డేట్​ చేసుకొని వారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.

    Aadhaar Updation | కావాల్సిన పత్రాలు

    ఆధార్​లో మార్పులు చేయాలనుకునే వారు పోర్టల్​లోకి వెళ్లి లాగిన్​ కావాల్సి ఉంటుంది. ఇంటి పేరు మార్పు కోసం పదో తరగతి మెమో లేదా మ్యారిజ్​ సర్టిఫికెట్​ అప్​లోడ్​ చేయాలి. పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, పాన్ కార్డ్ కూడా అప్​లోడ్​ చేయొచ్చు. చిరునామా మార్పు కోసం బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డ్, అద్దె ఒప్పందం (అద్దె ఇంట్లో నివసించేవారు) అప్​లోడ్​ చేయాలి. అనంతరం మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేయగానే ఆధార్​ అప్​డేట్​ ప్రక్రియ ముగుస్తుంది.

    Aadhaar Updation | ఉచిత ఆధార్ అప్​డేట్ గడువు పొడిగింపు

    ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్​డేట్​ చేసుకునే గడువును యూఐడీఏఐ పొడిగించింది. ఈ గడువు ఈ ఏడాది జూన్​ 14తో ముగుస్తుందని మొదట ప్రకటించింది. అయితే 2026 జూన్ 14 వరకు గడువు పొడిగించినట్లు ఎక్స్​ వేదిక ప్రకటించింది.

    Latest articles

    sanju samson century | ఆసియా కప్ 2025కి ముందు సంజూ శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్… గిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: sanju samson century : వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా...

    Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 25 : దేశంలో బంగారం, వెండి Silver ధరలు ఇటీవల...

    Pre Market Analysis | మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఫెడ్‌ చైర్మన్‌(Fec chiarman) జెరోమ్‌ పావెల్‌ జాక్సన్‌హోల్‌ ప్రసంగం తర్వాత...

    Makloor Murder case | ఇద్దరు యువకుల దారుణ హత్య.. అర్ధరాత్రి ఘటన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ​: Makloor Murder case | నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు...

    More like this