ePaper
More
    HomeతెలంగాణKTR | కేటీఆర్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు తప్పదా..!

    KTR | కేటీఆర్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు తప్పదా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేసు (Formula E Race) కేసులో అక్రమాలు, మాజీ మంత్రి ప్రమేయంపై ఆధారాలు సేకరించేందుకు ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటీకే ఈ కేసుల్లో కేటీఆర్​ను రెండుసార్లు విచారించింది. రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ ఆదేశించింది.

    కేటీఆర్‌ వాడిన సెల్‌ఫోన్‌, మ్యాక్‌బుక్‌, ట్యాబ్‌లో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచే కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటుంది. మరోవైపు న్యాయసలహా ప్రకారం నడుచుకుంటానని కేటీఆర్​ ప్రకటించారు. కేటీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా డాక్యుమెంట్లను ఏసీబీ తయారు చేస్తోంది. త్వరలోనే కీలక ఆధారాలతో ఏసీబీ తుది నివేదిక సిద్ధం చేయనుంది.

    KTR | అరెస్ట్​ తప్పదా..

    ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్​ను కీలక నిందితుడిగా ఏసీబీ (ACB) చేర్చింది. అలాగే ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సైతం కేటీఆర్​ శిక్షార్హుడ ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్​ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సిట్​ ఈ కేసును విచారిస్తోంది. ప్రభాకర్​ రావు వాంగ్మూలం ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టడానికి సిద్ధం అవుతోంది. దీంతో కేటీఆర్​ ను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఏసీబీ విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్​ తనను అరెస్ట్​ చేస్తే 15 రోజులు జైలులో రెస్ట్​ తీసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    More like this

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...

    Nepal | నేపాల్‌లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల స‌డ‌లింపు.. ర‌ద్దీగా మారిన మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నిర‌స‌న‌ల‌తో అట్టుడికిన నేపాల్‌లో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. రెండ్రోజుల పాటు విధ్వంసంతో...