అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Narayana | ఉమ్మడి జిల్లా నూతన ఇన్‌ఛార్జి మంత్రిగా నియమింపబడ్డ మంత్రి సీతక్కను (Minister Seethakka) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్ రోడ్స్‌కు (MLA PR Roads) అదనపు నిధులు కేటాయించాలని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్కను ఆయన కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
