అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Degree college | ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కొత్త కోర్సు మంజూరైంది. ఫార్మర్స్యూటికల్స్ మానుఫాక్చరింగ్ అండ్ క్వాలిటీ కోర్సు (Pharmaceuticals Manufacturing and Quality Course) మంజూరైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణ తెలిపారు. అలాగే కళాశాలలో ఇతర డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లకు సంబంధించి మూడో దశ దోస్త్ అడ్మిషన్ల (DOST Admissions) ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
