ePaper
More
    HomeUncategorizedSP Rajesh Chandra | కామారెడ్డి పోలీస్​ శాఖ పనితీరుకు నూతన లోగో నిదర్శనం

    SP Rajesh Chandra | కామారెడ్డి పోలీస్​ శాఖ పనితీరుకు నూతన లోగో నిదర్శనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ కొత్త లోగో తమ పనీతిరుని ప్రతిబింబిస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు శాఖలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఎస్పీ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన కొత్త లోగోను ఆవిష్కరించారు. కొత్త లోగోపై ‘FEARLESS ALWAYS.. VIGILENT FOREVER’ అనే క్యాప్షన్​ను జోడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో భయానికి తావులేదని, అజాగ్రత్తకు అవకాశమే లేదన్నారు.

    ఇందులో ప్రతిబింబించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను, కమిట్మెంట్​ను స్పష్టంగా వ్యక్తపరుస్తోందని తెలిపారు. ఈ లోగో కేవలం పోలీసుల గుర్తింపు మాత్రమే కాదని, కామారెడ్డి పోలీస్ శాఖ నిబద్ధత, ప్రజలపై బాధ్యతా భావం, న్యాయబద్ధమైన విధానాలను ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy), ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, ఎస్​బీ ఇన్​స్పెక్టర్​ తిరుపతయ్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...