ePaper
More
    Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌(Stock market) నష్టాలతో ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌(Sensex) 73 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై 21 పాయింట్లు పెరిగింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 465 పాయింట్లు కోల్పోయింది. 31 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. మరో ఐదు పాయింట్లు లాభపడింది. అక్కడి నుంచి 169 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్‌ 212 పాయింట్ల నష్టంతో 81,583 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 24,853 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ(BSE)లో 1,497 కంపెనీలు లాభపడగా 2,482 స్టాక్స్‌ నష్టపోయాయి. 139 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 79 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    మిడిల్‌ ఈస్ట్‌(Middle east)లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు G7 సదస్సునుంచి అర్ధంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం, టెహ్రాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడి ప్రజలను హెచ్చరించడం, సిట్యుయేషన్‌ రూమ్‌ను సిద్ధం చేయిస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై భారీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులు మార్కెట్‌లో భయాలను పెంచుతున్నాయి. ఫార్మా(Pharma) దిగుమతులపై త్వరలోనే టారిఫ్‌లు విధిస్తామన్న యూఎస్‌ అధ్యక్షుడి మాటలతో ఆ రంగంలోని షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

    Stock Market | ఐటీ మినహా అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

    ఐటీ సెక్టార్‌(IT sector) స్టాక్స్‌ మాత్రమే రాణించాయి. మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.74 శాతం పెరిగింది. ఫార్మా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామన్న ట్రంప్‌ ప్రకటనతో హెల్త్‌కేర్‌(Health care) ఇండెక్స్‌ 1.82 శాతం పతనమైంది. మెటల్‌ ఇండెక్స్‌ 1.29 శాతం, ఆయిల్‌ అండ్‌గ్యాస్‌ సూచీ 0.92 శాతం, ఇన్‌ఫ్రా 0.81 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 0.79 శాతం పడిపోయాయి. రియాలిటీ, ఎనర్జీ తదితర రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.67 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.56 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం నష్టంతో ముగిశాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో స్టెర్‌లైట్‌(Sterlite Technologies) 12.26 శాతం, హ్యాపీయస్ట్‌ మైండ్‌ 10.22 శాతం, సుప్రీం పెట్రో కెమికల్స్‌ 6.21 శాతం, హిటాచీ ఎనర్జీ 5.49 శాతం, ఓరియంట్‌ సిమెంట్‌ 5.12 శాతం పెరిగాయి.

    Stock Market | Top losers..

    షిప్పింగ్‌ కార్పొరేషన్‌(Shipping corporation) 8.28 శాతం, జూబిలంట్‌ ఇంగ్రేవియా 6.88 శాతం, వేసువియస్‌ ఇండియా 6.49 శాతం, ప్రిన్స్‌ పైప్స్‌ 5.97 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 5.19 శాతం నష్టపోయాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...