ePaper
More
    Homeక్రైంACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈఈ

    ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు శృతి మించిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్​, రెవెన్యూ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లో బర్త్​​, ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ నుంచి మొదలు పెడితే అన్ని పనులకు లంచాలు తీసుకుంటున్నారు. రూ.500 నుంచి మొదలుకొని రూ.లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారు.

    ముఖ్యంగా మున్సిపల్​ కార్యాలయాల్లో (Municipal Offices) అయితే ఇంటి పర్మిషన్లు, ఇతర అనుమతుల కోసం చేతులు తడపనిదే పనులు చేయడం లేదు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా.. డబ్బులు ఇవ్వకపోతే అధికారులు కొర్రీలు పెడుతూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ మున్సిపల్​ ఏఈఈ (Municipal AEE) ఏసీబీ అధికారులకు చిక్కింది.

    మేడ్చల్​ మల్కాజ్​గిరి (Medchal Malkajgiri) జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం (Kapra Municipality)లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి ఏఈఈ స్వరూప కాంట్రాక్టర్​ను చేసిన పనులను ఎం బుక్​లో నమోదు చేయడానికి రూ.1.20 లక్షల లంచం అడిగింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఏఈఈ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయాలి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    Latest articles

    KC Venugopal | ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ ఎదురుదాడి.. అన్ని ప‌రిమితులు దాటింద‌ని ఆరోప‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KC Venugopal | కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్ పార్టీ...

    Dhoni Fan | ఈ ఐదేళ్ల బుడ‌త‌డు ధోని వీరాభిమాని.. హెలికాఫ్టర్ షాట్స్‌తో దుమ్మురేపుతున్నాడుగా.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhoni Fan | స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడే పిల్లలుంటారు. కానీ కొంతమంది చిన్నారులు...

    108 Ambulance​ | 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్సు లోనే గర్భిణికి ప్రసవం

    అక్షరటుడే, ఆర్మూర్: 108 Ambulance​ | గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్​ సిబ్బంది...

    PM Modi | ఢిల్లీలో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. రెండు హైవేలను ప్రారంభించిన ప్రధాని మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీ మాములుగా ఉండదు. వాహనాల...

    More like this