అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మహమ్మద్‌నగర్ (Mahammad nagar) మండలంలోని కొమలంచ (komalancha) గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఇక నుంచి వారానికి రెండుసార్లు బిర్యానీ అందజేయనున్నట్లు సూపర్వైజర్ రాజేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు బాలచందర్, సురేందర్, జీపీ కార్యదర్శి రవీందర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
