Mullick Ghat Flower Market
Mullick Ghat Flower Market | ఏషియాలోనే అతి పెద్ద పూల మార్కెట్.. రోజుకి కోటి రూపాయ‌ల వ్యాపారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Mullick Ghat Flower Market | కోల్‌కతాలోని ముల్లిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్ (Mullick Ghat Flower Market) ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ మార్కెట్ ని 1855లో రామ్ మోహన్ ముల్లిక్(Ram Mohan Mullick) నిర్మించారు, ఇది కోల్‌కతా నగరానికి సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జి చివరలో, హూఘ్లీ నది ఒడ్డున ఉంది . ఈ మార్కెట్‌లో గులాబీలు, మల్లిగే, జాస్మిన్, మోరింగ్, లిల్లీలు, ఆర్కిడ్స్ వంటి 100కి పైగా పుష్పాల రకాలు లభిస్తాయి. ఇవి స్థానికంగా మరియు విదేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి .ప్రతి రోజు ఉదయం 4 గంటలకు సుమారు 4,000 మంది విక్ర‌య‌దారులు తమ పుష్పాలను మార్కెట్‌లోకి తెచ్చి, రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తారు .

Mullick Ghat Flower Market | ఎటు చూసిన పూలే..

హౌరా బ్రిడ్జి(Howrah Bridge) కింద ఉన్న ఈ మార్కెట్, రంగుల పుష్పాలతో నిండి ఉంటుంది కాబ‌ట్టి, ఫోటోగ్రాఫీ కూడా ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది . ఉదయం 4 గంటల నుండి మార్కెట్ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల సమయంలో మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది కాబ‌ట్టి ఫోటోగ్రాఫీ కోసం ఉత్తమ సమయంగా చెప్ప‌వ‌చ్చు. మార్కెట్ సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది . ఇక్క‌డికి వెళ్లాలంటే హౌరా రైల్వే స్టేషన్ నుండి హౌరా బ్రిడ్జి దాటండి. బ్రిడ్జి చివరలో ఉన్న మెట్లను ఎక్కి మార్కెట్‌కు చేరుకోవచ్చు .రోడ్ ద్వారా వెళ్లాలి అంటే స్ట్రాండ్ రోడ్ ద్వారా మార్కెట్‌కు చేరుకోవచ్చు. ఇది బీబీడీ బాగ్ ప్రాంతంలో ఉంది .

మార్కెట్ ప్రాంతం మొత్తం మట్టి మరియు నీటితో నిండి ఉంటుంది. కాబ‌ట్టి షూస్ ధరించి వెళ్ల‌డం మంచిది . ఇక మార్కెట్ చుట్టూ ఉన్న చిన్న చాయ్ స్టాల్స్ వద్ద మట్టి గిన్నెలో చాయ్ మరియు కోచురీ వంటి స్థానిక వంటకాలను కూడా ఆస్వాదింవ‌చ్చు. ముల్లిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్ సందర్శించడం ద్వారా కోల్‌కతా (Kolkata) నగరపు సాంస్కృతిక వైవిధ్యాన్ని, చరిత్రను మరియు స్థానిక జీవనశైలిని అనుభవించవచ్చు. ఇది ఏషియాలోనే అతి పెద్ద పూల మార్కెట్‌గా ఖ్యాతిని గ‌డించింది. ఇక్కడ రోజుకి కోటి రూపాయ‌ల వ‌ర‌కు బిజినెస్ జ‌రుగుతుంద‌ని టాక్. 1855 నుండి ఈ పూల వ్యాపారం జ‌రుగుతుంది. ఫెస్టివ‌ల్‌, వెడ్డింగ్ సీజ‌న్స్ లో ఇక్కడ 2 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఈ మార్కెట్ లోని పూలు బంగ్లాదేశ్‌తో పాటు ఇత‌ర దేశాల‌కి కూడా ఎక్స్‌పోర్ట్ అవుతాయి.