అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీస్‌శాఖ(Nizamabad Police Commissionerate) ఆధ్వర్యంలో కంఠేశ్వర్ (Kanteshwar) బైపాస్ రోడ్డు మధ్య ఇటీవల బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈదురుగాలులు వీయడంతో బారికేడ్లు నేలకొరిగాయి. దీంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బారికేడ్లను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని.. రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
