ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Liquor Scam | విచారణ పేరుతో సిట్​ అధికారులు దాడి చేశారు.. చెవిరెడ్డి గన్​మెన్​ సంచలన...

    Liquor Scam | విచారణ పేరుతో సిట్​ అధికారులు దాడి చేశారు.. చెవిరెడ్డి గన్​మెన్​ సంచలన లేఖ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Liquor Scam | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో లిక్కర్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు విచారణ నిమిత్తం సిట్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్​ అధికారులు(Sit Officers) ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేశారు. ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy) హస్తం ఉందని సిట్​ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఆయన గన్​మన్​గా పనిచేసిన ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్​ మదన్​రెడ్డి(Head Constable Madan Reddy)ని ఇటీవల విచారించారు.

    Liquor Scam | ఒంటరిగా వెళ్లలేను

    ఏపీ ప్రభుత్వానికి(AP government) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్​రెడ్డి సంచలన లేఖ రాశారు. సీఎం(CM), డిప్యూటీ సీఎం(Deputy CM), డీజీపీ(DGP)కి ఆయన రాసిన లేఖ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా ఆయన పని చేశారు. లిక్కర్ కేసులో వారు చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. తన కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారన్నారు. విచారణకు యూనిఫామ్‌లో వెళ్లనందుకు తనను తిట్టారని ఆయన లేఖలో పేర్కొన్నారు. చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పామన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు సిట్ అధికారులు తనపై దాడులు చేశారని ఆరోపించారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు(High Court)ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. విచారణకు న్యాయవాదిని అనుమతించాలని ఆయన కోర్టులో పిటిషన్​ వేశారు.

    Liquor Scam | చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

    బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా.. లుకౌట్ నోటీసుల(Lookout notices) కింద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎయిర్​పోర్ట్​ నుంచి వెనుతిరిగారు. ఆయనను విజయవాడలోని సిట్​ కార్యాలయానికి(SIT office) పోలీసులు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.

    More like this

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....