Municipal Corporation
Municipal Corporation | ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పనిచేయాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Corporation | మున్సిపల్​ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉండదని కార్పొరేషన్​​ కమిషనర్ దిలీప్​కుమార్​ అన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) కార్యక్రమంలో భాగంగా నగరంలోని సర్కిల్​–5 పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. డీ–52 కెనాల్​, కంఠేశ్వర్​ బైపాస్(Kanteshwar Bypass)​, పూలాంగ్​, ఐటీఐ గ్రౌండ్​, ఆర్యనగర్​ తదితర ప్రాంతంలో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఏరియా జవాన్లు, కార్మికులు చురుకుగా పాల్గొన్నారు.