ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణలో కీలక మలుపు

    Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణలో కీలక మలుపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ విచారణలో కీలక మలుపు తీసుకుంది. బీఆర్​ఎస్​ హయాంలో నిర్మించిన కాళేశ్వరంలో భారీగా అక్రమాలు జరిగాయని, నాసిరకం పనులతో మేడిగడ్డ(Medigadda) కుంగిందని కాంగ్రెస్​ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​(Justice PC Ghosh Commission)ను ఏర్పాటు చేసింది.

    కాళేశ్వరం కమిషన్​ ప్రాజెక్ట్​ బ్యారేజీల నిర్మాణం, స్థలం మార్పుతో ఖర్చు వివరాలు సహా ఇతర కీలక అంశాలపై విచారణ చేపట్టింది. అప్పుడు విధులు నిర్వహించిన దాదాపు 200 మంది అధికారులను కమిషన్​ విచారించింది. అంతేగాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రులు హరీశ్​రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendhar)​ను సైతం కమిషన్​ విచారించింది. ఈ క్రమంలో కేబినెట్​ ఆమోదంతోనే అన్ని పనులు చేశామని ఈటల, హరీశ్​రావు కమిషన్​కు తెలిపారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేబినెట్​ మీటింగ్​ల మినిట్స్​ ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్​ ప్రభుత్వాన్ని కోరింది.

    Kaleshwaram Commission | కమిషన్​ లేఖపై చర్చించిన సీఎం

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు(Kaleshwaram Project) సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 13న నీటిపారుదలశాఖకు కూడా లేఖ రాసింది. కమిషన్‌ లేఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కమిషన్​కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన వివరాలను కేబినెట్​ మినిట్స్​తో సరిపోల్చిన అనంతరం కమిషన్​ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

    More like this

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...