ePaper
More
    HomeజాతీయంMaharashtra | టన్నెల్స్‌లో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల‌కి హెచ్చ‌రిక‌.. వేగ ప‌రిమితిని త‌ప్ప‌క పాటించాలి

    Maharashtra | టన్నెల్స్‌లో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల‌కి హెచ్చ‌రిక‌.. వేగ ప‌రిమితిని త‌ప్ప‌క పాటించాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Maharashtra CM Eknath Shinde) ముంబైలోనే అతి పొడవైన ఇంట్రా-సిటీ భూగర్భ రహదారిని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 3.93 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్‌లో ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్(Princess Street Flyover) నుండి ప్రియదర్శని పార్క్(Priyadarshani Park) వరకు విస్తరించి ఉంది. ఇందులో అధునాతన సాంకేతికతతో పాటు నియంత్రణ వ్యవస్థలతో కూడిన సొరంగాలు ఉన్నాయి. అయితే ట‌న్నెల్ లోప‌ల ప్ర‌యాణించే వారికి కొన్ని సూచ‌న‌లు అందించారు అధికారులు.

    Maharashtra | ఇవి పాటించండి..

    టన్నెల్‌లో (Tunnel) ప్రయాణిస్తున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టన్నెళ్లలో ప్రయాణించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. టన్నెళ్ల లోపల తడిగా ఉన్న నేప‌థ్యంలో టైర్స్ స్కిడ్ అయ్యే ప్ర‌మాదం ఉంది. ఇది ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని వారు తెలిపారు.అందుకే వాహ‌న‌దారులు లేన్ డిసిప్లిన్ పాటించండి అని అధికారులు చెప్పుకొచ్చారు.

    అందులో ప్రయాణించేవారు నిర్దిష్ట వేగ పరిమితి (Speed Limit)కి లోబడే ప్రయాణించండి. స‌డెన్‌ బ్రేకింగ్(Sudden braking), లైన్ మార్చడం నివారించండి. ముందున్న వాహనానికి తగినంత దూరంలో ప్ర‌యాణించండి అని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే, ఘోర‌ ప్రమాదాలు ఎదురయ్యే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు(Traffic police) హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అందుకని అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ మీ జీవితాన్ని రిస్క్‌లో ప‌డేసుకోకండి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...