ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael- Iran | అత్యంత సురక్షిత ప్రాంతానికి ఖమేనీ

    Israel- Iran | అత్యంత సురక్షిత ప్రాంతానికి ఖమేనీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Israel- Iran | ఇరాన్​– ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్​ అణుశక్తి గల దేశంగా అవతరిస్తే తమ ఉనికికే ముప్పు అని భావించిన ఇజ్రాయెల్​ ఆపరేషన్​ రైజింగ్​ లయన్(Operation Rising Lion)​ పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్​ కూడా ప్రతిదాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) సోమవారం బంకర్​లో తలదాచుకున్నారు. తాజాగా ఆయనను మరింత సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.

    Israel- Iran | తొలిరోజే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు

    ఇజ్రాయెల్​ తొలిరోజు ఖమేనీ ఇంటి సమీపంలో దాడులకు పాల్పడింది. అంతేగాకుండా తాజాగా ఆయన తలదాచుకున్న బంకర్​ వివరాలను కూడా మొసాద్​ కనిపెట్టింది. దీంతో ఆయనను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎక్కడ సురక్షితం కాదు అని ఇజ్రాయెల్​ ఆయనకు హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.

    Israel- Iran | అలా చేస్తే యుద్ధం ముగుస్తుంది

    ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు(Israeli PM Netanyahu) యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్​ సుప్రీం కమాండర్​ ఖమేనీని హతమారిస్తే యుద్ధం ముగుస్తుందన్నారు. తాము యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖమేనీని హతమారిస్తే సంఘర్షణ పెరగదని, యుద్ధం త్వరగా ముగుస్తుందని పేర్కొన్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...