ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో దారుణం

    Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో దారుణం

    Published on

    అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను ఓ టీడీపీ కార్యకర్త చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది.

    నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం రూ.80,000 అప్పు తీసుకున్నారు. కాగా, అప్పు తీర్చలేక భార్య శిరీష (25), తన బిడ్డలను వదిలి తిమ్మరాయప్ప గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు.

    దీంతో శిరీష కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. సకాలంలో డబ్బులు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా.. మునికన్నప్ప అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఈడ్చుకొంటూ వెళ్లి తాడుతో బలవంతంగా చెట్టుకు శిరీషను కట్టేసి కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...