అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balochistan Bomb blast : పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ baluchistan ప్రావిన్స్ province వరుస బాంబు పేలుళ్లతో వణికి పోతోంది. గురువారం జరిగిన పేలుడులో ముగ్గురు మరణించిన ఘటన మరువక ముందే మరో బాబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో బాంబు పేలి, నలుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది.
అల్లర్లు జరుగుతున్న పాకిస్తాన్ Pakistan లోని నైరుతి ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వెహికల్ కు సమీపంలోనే ఈ బాంబు పేలింది. కాగా, ఈ దాడికి ఏ గ్రూపు కూడా బాధ్యత వహించనప్పటికీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పనే అని తెలుస్తోంది. BLF తరచుగా ప్రావిన్స్ లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో గత కొంతకాలంగా వేర్పాటువాదుల తిరుగుబాటు కొనసాగుతోంది. ఈ ప్రావిన్స్ లో 2019లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ Balochistan Liberation Army ని యునైటెడ్ స్టేట్స్ United States ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.