ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    Seven Hills Express Train | తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Seven Hills Express Train : ప్రస్తుత రోజుల్లో ప్రయాణికుల ప్రాణాల‌కి గ్యారెంటీ అనేది లేకుండా పోయింది. బ‌స్సుల్లో, రైళ్ల‌లో, ఫ్లైట్స్‌లో ఎలా ప్ర‌యాణించినా కూడా ప్ర‌మాదం పొంచి ఉంటూనే ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో ఏకంగా 241 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం మ‌రిచిపోక ముందే చాలా ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌(Tirupati to Secunderabad train) వస్తున్న సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (Seven Hills Express) రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది.

    Seven Hills Express Train : ప్ర‌మాదం త‌ప్పింది..

    సోమవారం రాత్రి సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ 1279 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో రాత్రి 8.55 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathyasai district) ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్‌ (Chigicherla railway station) సమీపంలో రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెనక ఉన్న గార్డు.. లోకో పైలెట్‌ను అప్రమత్తం చేశారు. ప్రయాణికులు కూడా చైన్‌ లాగారు. రైలు ఆగగానే ప్రయాణికులు కిందకు దూకారు. చీకట్లో కంకర రాళ్లల్లో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే గార్డు మంటలను అగ్నిమాపక పరికరాలతో ఆర్పివేశారు. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు ఆగిపోయింది.

    అయితే బోగీ నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విన్న రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన తక్షణమే లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైలును సురక్షితంగా నిలిపివేశారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి, సాంకేతిక సమస్యను Technical Issue తాత్కాలికంగా సరిదిద్దిన తర్వాత రైలు సికింద్రాబాద్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...