ePaper
More
    HomeజాతీయంAir India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన...

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అనుమానాస్పద సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన వెంటనే దేశ రాజధానికి తిరిగి మళ్లించారు.

    బోయింగ్ 737 మాక్స్ 8 ఫ్లైట్​ సాయంత్రం 6:20 గంటలకు రాంచీ(Ranchi)లోని బిర్సా ముండా విమానాశ్రయం(Birsa Munda Airport)లో ల్యాండ్ కావాల్సి ఉంది. తనిఖీ, క్లియరెన్స్ తర్వాత.. విమానాన్ని తిరిగి ప్రణాళిక ప్రకారం నడిపినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. “మా విమానాలలో ఒకటి అనుమానాస్పద సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన తర్వాత మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చింది. తనిఖీలు, క్లియరెన్స్ తర్వాత.. విమానం షెడ్యూల్ ప్రకారం నడిచింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం” అని ప్రతినిధి వివరించారు.

    ఢిల్లీ(Delhi)లో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్ గాలిలో సాంకేతిక సమస్య ఉందని అనుమానించడంతో హాంకాంగ్‌(Hong Kong)కు తిరిగి మళ్లించారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing Dreamliner 787-8) అయిన AI 315 ఫ్లైట్​ హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఫ్లైట్ ట్రాకింగ్ సైట్, ఫ్లైట్ రాడార్ 24 (Flight Radar 24) ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్​ మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది.

    ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారని, విమానం భద్రతా తనిఖీలో ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పైలట్ విమానంలో ఏదో సాంకేతిక సమస్య ఉందని అనుమానించాడు. ముందు జాగ్రత్త చర్యగా, విమానం తిరిగి వెనక్కి వచ్చింది. జూన్ 12న అహ్మదాబాద్‌(Ahmedabad)లో విమాన ప్రమాద(plane crash) దుర్ఘటన జరిగాక.. తాజాగా ఈ ఫ్లైట్​ల ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...