POK | పీవోకేను భారత్​లో కలపండి : సీఎం రేవంత్​రెడ్డి
POK | పీవోకేను భారత్​లో కలపండి : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : POK | పాక్ ఆక్రమిత కశ్మీర్​(POK)ను భారత్​లో కలపాలని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy ప్రధాని మోదీ PM Modiని కోరారు. పహల్గామ్​ ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం రాత్రి హైదరాబాద్​ hyderabadలోని నెక్లెస్​రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ candle rally నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ indira gandhi పాక్​కు గట్టి బుద్ధి చెప్పారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్​ను రెండు ముక్కలు చేశారని గుర్తు చేశారు. నాడు ఇందిరాగాంధీని వాజ్ పేయి vajpayee దుర్గామాతతో పోల్చారని, దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలని సీఎం కోరారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలన్నారు. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి pm modi మద్దతుగా ఉంటారన్నారు. పర్యాటకులపై దాడి చేసి చంపడం తీవ్రమైన ఘటన అని ముఖ్యమంత్రి అన్నారు. అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.