ePaper
More
    HomeతెలంగాణHarish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావుకు అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్​తో బాధ పడుతున్న ఆయనను బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ (Kims sunshine) ఆస్పత్రికి తరలించారు. వైద్యులకు ఆయన చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​ను ఏసీబీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం కేటీఆర్​ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హరీశ్​రావు కూడా మాట్లాడారు. అయితే కార్యక్రమం మధ్యలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాయకులు హరీశ్​ రావును ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్​ కొద్ది సేపట్లో ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...