Drunk Drive Test
Drunk Drive Test | మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | భార్య మృతికి కారణమైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎస్సీ రాజేష్​ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లి (Devunipalli) గ్రామానికి చెందిన గొల్ల భార్గవికి గాంధారి (Gandhari) మండలం పెద్ద పోతంగల్​ గ్రామానికి చెందిన ముక్కర శ్రీనివాస్​తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లయినప్పటికీ నుంచి భర్త, అత్త ఇద్దరూ అదనపు కట్నం కోసం వేధించేవారు.

ఈ విషయమై పలుమార్లు పంచాయతీలు చేసినప్పటికీ శ్రీనివాస్​ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బాబు పుట్టిన తర్వాత భార్గవిని అత్తగారింటికి పంపించగా భర్త, అత్తల వేధింపుల కారణంగా ఆమె విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్నిరోజులకు మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్గవి మృతికి భర్త శ్రీనివాస్​, అత్త లక్ష్మి కారణమని సాక్ష్యాలతో నిరూపించారు. దీంతో న్యాయస్థానం శ్రీనివాస్​కు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని ఎస్పీ తెలిపారు.