అక్షరటుడే, ఆర్మూర్: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేసి, అనుసంధానించింది. ఈమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్‌గా ప్రారంభించారు. ఆలూర్ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి (TSSDC Chairman Anvesh Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, ఏవో రాంబాబు, ముక్కెర విజయ్, మల్లారెడ్డి, జితేందర్, భోజారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Raitu Vedika | నిజాంసాగర్ మండలంలో..

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట (Achampet) రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో అచ్చంపేట రైతువేదిక ప్రత్యేకాధికారి ఎంపీడీవో గంగాధర్, ఏవో అమర్ ప్రసాద్, ఏఈవోలు స్వర్ణలత, సాగర్, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.