ePaper
More
    Homeఅంతర్జాతీయంIran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర దేశాలను టార్గెట్‌గా చేసుకుంటామన్న ఇరాన్‌(Iran) అన్నంత పని చేసింది. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై (US embassy) క్షిపణితో దాడి చేసింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవివ్​లోని అమెరికా ఎంబసీ కార్యాలయం భవనం దెబ్బతింది. దీంతో ఎంబసీని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్​లోని అమెరికా రాయబారి మైక్ మకబి సోమవారం ధ్రువీకరించారు. అయితే, ఈ దాడిలో యూఎస్ దౌత్య సిబ్బంది ఎవరూ మృతి చెందలేదని, గాయపడలేదని పేర్కొన్నారు.

    Iran Missile Attack | నష్టం స్వల్పమే..

    ఇరాన్ క్షిపణి దాడితో (Iran missile attack) నష్టం స్వల్పంగా జరిగిందని, సిబ్బందికి అసౌకర్యం కలుగకుండా సోమవారం కార్యాలయాన్ని మూసివేశామని మకబి తెలిపారు. క్షిపణి దాడితో యూఎస్ కార్యాలయ భవనానికి చెందిన విండో గ్లాసులు దెబ్బతిన్నాయి. ఎమర్జెన్సీ ప్రోటాకాల్​కు(emergency protocol) అనుగుణంగా ఎంబసీ సిబ్బందిని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. ఇజ్రాయెల్, ఇరాన్(Israel – Iran) మధ్య వైరం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికన్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన క్షిపణి దాడి ఈ ప్రాంతంలోని అమెరికా దౌత్య కార్యకలాపాలకు మొదటి ప్రత్యక్ష ముప్పు అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో సుమారు ఏడు లక్షల మంది అమెరికన్లు నివాసముంటున్నారు. ఇరాన్‌ నేరుగా దాడి చేస్తుండడంతో వారి భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    Iran Missile Attack | తగ్గని ఉద్రిక్తతలు..

    ఇరాన్‌, ఇజ్రాయెల్‌(Israel – Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గడం లేదు. రెండు దేశాలు పరస్పర దాడులతో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణి దాడులను ప్రారంభించింది. ఇరాన్ దాదాపు 100 క్షిపణులను (100 missiles) ప్రయోగించింది. గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్‌ తమపై దాడి చేస్తూ 224 మందిని బలిగొన్నదని, తమ సైనిక, అణు మౌలిక సదుపాయాలను దెబ్బ తీసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై కొత్త తరంగ క్షిపణి దాడులను (missile attacks) ప్రయోగించింది.

    Iran Missile Attack | ట్రంప్‌ స్పందనపై సస్పెన్స్..

    ఇరాన్‌పై కొంతకాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (US President Donald Trump). తాజాగా తమ దేశ రాయబార కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తమ సైనిక మౌలిక వసతులను టార్గెట్‌గా చేసుకుంటే ఊహించని రీతిలో దెబ్బ తీస్తామని ట్రంప్ రెండ్రోజుల క్రితమే హెచ్చరించారు. అయినప్పటికీ పెడ చెవిన పెట్టిన ఇరాన్‌.. యూఎస్‌ ఎంబసీపైకి క్షిపణిని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇంతకాలం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా.. నేరుగా సైనిక పరంగా జోక్యంచేసుకోలేదు. ఇప్పుడు ఇరాన్‌ తమ ఎంబసీపై దాడి చేయడంతో యుద్ధంలో పాల్గొనే అవకాశముందన్న భావన వ్యక్తమవుతోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...