అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో (Government Girls Junior College) ఒకేషనల్ ఆఫీస్ అసిస్టెంట్ షిప్ కోర్సు ఫస్టియర్ అభ్యసిస్తున్న శ్రీహర్షిని అత్యుత్తమ మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 493 సాధించిన సందర్భంగా డీఐఈవో రవికుమార్ ఆమెను అభినందించారు. సెకండియర్లో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ
Published on
