అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: prajavani | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలిరాగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.