అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic | నగరంలో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి ప్రయాణికులకు ప్రమాదం జరుగకుండా చూశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ (South India Shopping Mall) ఎదుట శుక్రవారం సాయంత్రం 11కేవీ రెండు వైర్లు ఆకస్మాత్తుగా తెగి రోడ్డుపై పడ్డాయి. స్పందించిన ట్రాఫిక్ సీఐ ప్రసాద్ (Traffic CI Prasad) రోడ్డుకు ఇరువైపులా బారికేట్లు ఏర్పాటు చేయించారు. రాకపోకలను నిలిపేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.