Nizamsagar
Nizamsagar | పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయండి

అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar | మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం తహశీల్దార్‌ భిక్షపతికి (Tahsildar) ప్రజావాణిలో (Prajavani) వినతిపత్రం అందజేశారు.

అలాగే ఎంపీడీవోకు సైతం విన్నవించారు. మూడేళ్ల కిందట పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని, పంచాయతీకి భవనం లేకపోవడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అనీస్‌ పటేల్, రాము రాథోడ్, గాండ్ల రమేష్, జమీల్, రాములు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.