ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial Park)లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.

    ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీ(West Valley City)లో గల సెంటెనియల్ పార్క్‌లో ఆదివారం రాత్రి ‘వెస్ట్‌ఫెస్ట్’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎజ్రా పంతలియోన్(8 నెలలు), పాల్ తాహి(20), ఏంజెలికా చావెజ్(21) గా గుర్తించారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అక్కడ ప్రజల కంటే తుపాకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. విచ్చలవిడిగా తుపాకులు లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన కొందరు ఇలా కాల్పులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...