ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PMP RMP Association | ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి

    PMP RMP Association | ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: PMP RMP Association | జిల్లాలో మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులను వెంటనే ఆపాలని పీఎంపీలు ఆర్​ఎంపీలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్​ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా పాత కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్​ఎంపీ, పీఎంపీ అసోసియేషన్​ ప్రతినిధులు మాట్లాడుతూ తమపై స్టేట్ మెడికల్ కౌన్సిల్ పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

    దివంగత సీఎం రాజశేఖర్​ రెడ్డి (Late CM Rajasekhar Reddy) హయాంలో కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) గ్రామీణ వైద్యులకు పారా మెడికల్​ శిక్షణ (Paramedical training) ఇచ్చారని వివరించారు. శిక్షణ పూర్తయిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు ఇచ్చి తమను గుర్తించాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, బోధన్, ఆర్మూర్​ డివిజన్ల అధ్యక్షులు రాజగోపాల్ చారి, సాయిలు, సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి....

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...