అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి సూచించారు. బీర్కూర్(Birkur) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులైన 10వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇన్ఛార్జి హెచ్ఎం రాధాకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, విశ్రాంత ఉపాధ్యాయుడు విఠల్, అధ్యాపకులు చంద్రశేఖర్, రంజిత్, దేవిసింగ్, సౌమ్య, సతీష్, నారాగౌడ్, సుభాష్, బాలకిషన్, రాకేష్, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.
