అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Supplementary Results | తెలంగాణ(Telangana)లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో తప్పిన వారితో పాటు ఇంటర్ ఫస్టియర్లో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులు(Students) సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలో మే 22 నుంచి 30 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.