ePaper
More
    HomeజాతీయంMaharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే కేదార్​నాథ్​లో హెలికాప్టర్​ కూలి ఆరుగురు చనిపోయారు. మహారాష్ట్ర(Maharashtra)లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయి ఆరుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా సోమవారం లక్నోలో సౌదీ ఎయిర్​లైన్స్​ విమానం టైర్​కు నిప్పు అంటుకుంది. మరోవైపు మహారాష్ట్రలో ఓ రైలు(Train)లో మంటలు చెలరేగాయి. దీంతో వరుస ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    మహారాష్ట్రలోని దౌండ్ నుంచి పూణేకు వెళ్తున్న డెమూ రైలు(Demo train)లో సోమవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కోచ్‌లో వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు(Railway officers) సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...