ePaper
More
    HomeతెలంగాణKTR | కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్​

    KTR | కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :KTR | రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం(congress government) బీఆర్​ఎస్​ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగిందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కేసుల్లో విచారణ అధికారులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం మాజీ మంత్రి, బీఆర్​ఎస్ ప్రెసిడెంట్​ ఏసీబీ(ACB) ఎదుట హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనను ఆదేశించింది.

    KTR | కేసీఆర్​తో భేటీ

    కేటీఆర్(KTR)​ ఏసీబీ విచారణకు బయలు దేరారు. ఈ క్రమంలో నందినగర్‌లోని తన నివాసానికి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్‌(Former CM KCR)తో భేటీ అయ్యారు. కాసేపట్లో ఫార్ములా-ఈ కేసు(Formula-E Case)లో ఏసీబీ విచారణకు ఆయన హాజరు కానున్నారు. నందినగర్‌ నుంచి ఏసీబీ ఆఫీసుకు వెళ్లే దారిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్​ను కేసీఆర్​ విచారించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

    KTR | దర్యాప్తు వేగవంతం

    రాష్ట్ర ప్రభుత్వం బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణ వేగవంతం చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwar Project)లో జరిగిన అక్రమాలపై కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh)​ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్​ను విచారించిన విషయ తెలిసిందే.

    మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​ కేసు(phone tapping case)లో సిట్ అధికారులు ప్రభాకర్​రావును ఇప్పటికే మూడు రోజులు విచారించారు. మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్​ను ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారించనున్నారు. ఓ వైపు స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం బీఆర్​ఎస్​ నేతలే(BRS leaders) లక్ష్యంగా విచారణ చేపట్టడం గమనార్హం.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...