Gold
Today Gold Price | భ‌గ్గుమంటున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు ఈ మ‌ధ్య పైపైకి పోతున్నాయి. దీంతో కొనే ప‌రిస్థితి లేదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. దేశీయంగా పసిడి ధర ఆల్ టైం హైకి చేరుకున్నా.. బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ త‌గ్గ‌డం లేదు. అయితే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. ఎందుకంటే బంగారం ధరలు చుక్కలను తాకుతూ పెరిగాయి. బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం వరకు రూ.95 వేలకు పైన ట్రేడ్ అయిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 3,750 పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్​ల పుత్తడి(22-carat gold) ధర స్వల్పంగా తగ్గి తులం (10 గ్రాములు) రూ.93,190 వద్ద ఉంది.

Today Gold Price : కాస్త ఉప‌శ‌మ‌నం..

24 క్యారెట్​ల స్వచ్ఛమైన బంగారం(24-carat pure gold) ధర తులం రూ.1,01,670 వద్ద ట్రేడవుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ Vijayawada, విశాఖ పట్నం Visakhapatnam, పొద్దుటూరు Poddutur, రాజమండ్రి Rajahmundry, వరంగల్(warangal) లో కూడా కొనసాగుతున్నాయి. దేశంలో బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావితం అవుతాయి.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,820 కు చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్​ల(22 carat gold) ధర రూ. 93,340 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్​ల ధర రూ. 93,190లు ఉండగా.. 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,670కి చేరుకుంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, కేరళలలో కూడా కొనసాగుతున్నాయి.

భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి కరెన్సీ కదలికపై కూడా వెండి ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో(Dollar) పోలిస్తే రూపాయి పడిపోతే, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే బంగారం బాటలోనే వెండి నడుస్తూ నేడు స్వల్పంగా తగ్గింది. ఈ రోజు కిలో వెండి ధర వంద రూపాయల మేర తగ్గి రూ. 1,09,900లగా కొనసాగుతోంది.