ePaper
More
    Homeఅంతర్జాతీయంHighest Population | అత్య‌ధిక జ‌నాభా ఇండియాలోనే.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌

    Highest Population | అత్య‌ధిక జ‌నాభా ఇండియాలోనే.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: highest population : అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ రికార్డులకెక్కింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జనాభా క‌లిగిన దేశంగా ఇండియా India మొద‌టి స్థానంలో నిలిచింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ (World Population Review – WPR) అంచనాల ఆధారంగా 1.46 బిలియ‌న్ల‌ జ‌నాభాతో భార‌త్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా, 1.42 బిలియ‌న్ల‌ పాపులేష‌న్‌తో చైనా China రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇండియాలో జ‌నాభా పెరుగుద‌ల అనేక దశాబ్దాల పాటు కొనసాగుతుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేయబడింది. గ‌తంలో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా చైనా ముందుండేది. అయితే, అక్క‌డ కుటుంబ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో వృద్ధి రేటు మంద‌గించింది. అదే స‌మ‌యంలో భార‌త్‌లో జ‌నాభా వృద్ధి పెరుగ‌డం ప్రారంభ‌మైంది. రెండు, మూడు ద‌శాబ్దాలుగా జ‌న‌న రేటు పెరుగ‌డంతో ఇండియా చైనాను అధిగ‌మించి ఫ‌స్ట్ ప్లేస్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం భార‌త జ‌నాభా 146 కోట్లకు చేరుకుంది.

    highest population : మూడో ప్లేస్‌లో అమెరికా

    146 కోట్ల జ‌నాభాతో ఇండియా మొదటి స్థానంలో ఉండ‌గా, చైనా రెండో స్థానంలో ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికా 34.72 కోట్ల జ‌నాభాతో మూడో స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత స్థానాల్లో ఇండోనేషియా Indonesia (28.57 కోట్లు), పాకిస్తాన్ Pakistan(25.52 కోట్లు) , నైజీరియా Nigeria (23.75కోట్లు), బ్రెజిల్ Brazil (21.28 కోట్లు), బంగ్లాదేశ్ Bangladesh (17.56 కోట్లు), రష్యా Russia (14.39 కోట్లు), ఇథియోపియా Ethiopia(13.54 కోట్లు) నిలిచాయి. మెక్సికో(Mexico), జపాన్(Japan), ఈజిప్ట్(Egypt), ఫిలిప్పీన్స్(Philippines), కాంగో(Congo), వియత్నాం(Vietnam) వంటి దేశాల జ‌నాభా ప‌ది కోట్ల‌కు పైగానే ఉంది.

    highest population : త‌గ్గుతున్న వార్షిక వృద్ధి రేటు

    ప్రపంచ జనాభా world population పెరుగుతూనే ఉన్నప్పటికీ, వార్షిక వృద్ధి రేటు మందగిస్తోంది. 2025లో ఈ రేటు సంవత్సరానికి దాదాపు 0.85 శాతానికి ప‌డిపోయింది. ఇది 2015లో 1.25 శాతంగా ఉండ‌గా, .2020 నాటికి 0.97 శాతానికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం వార్షిక జ‌నాభా వృద్ధి రేటు 0.85 శాతానికి ప‌రిమిత‌మైంది. ప్రస్తుత ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. సంవత్సరానికి 70 మిలియన్ల మేర జ‌నాభా పెరుగుతుందని అంచనా. 2037 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సంతానోత్ప‌త్తి రేటు కూడా త‌గ్గిపోయింది. ఉరుకుల ప‌రుగులు జీవ‌నం, మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు సంతానోత్ప‌త్తి రేటుపై ప్ర‌భావం చూపాయి.

    highest population : పెరిగిన ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌

    ప్ర‌పంచ జ‌నాభాలో అత్య‌ధికంగా ప‌ట్ట‌ణాల్లోనే నివ‌సిస్తున్నారు. ఆధునిక కాలంలో చ‌దువు, ఉద్యోగాల పేరిట పెద్ద సంఖ్య‌లో ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స పోతున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రామీణ వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగ‌వుతుండ‌గా, ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభాలో 57% కంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఇది 2050 నాటికి 68%కి చేరుకుంటారని అంచనా.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...