ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | సైప్రస్​ చేరుకున్న ప్రధాని మోదీ

    PM Modi | సైప్రస్​ చేరుకున్న ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సైప్రస్​ (Cyprus) దేశానికి చేరుకున్నారు. ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సైప్రస్​ చేరుకోగా.. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కాగా 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్​లో పర్యటించడం గమనార్హం.

    సైప్రస్​ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కెనడా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు జూన్​ 16, 17 తేదీల్లో జరిగే జీ–7 సదస్సులో (G-7 Summit) పాల్గొంటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో క్రొయేషియాను కూడా సందర్శిస్తారు.

    PM Modi | ప్రధాని మోదీని కలిసిన వ్యక్తి ఆనందం

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. ప్రవాసుల్లో కూడా మోదీ అభిమానులు భారీగానే ఉంటారు. ఈ క్రమంలో సైప్రస్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని లిమాసోల్​ నగరంలో నరేందర్​ అనే వ్యక్తి కలిశాడు. ప్రధాని అక్కడ ప్రవాసులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్​ మోదీని క​వగా ఆయన కుమార్తెను ఆశీర్వాదించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “మోదీ నా కుమార్తెను ఆశీర్వాదించారు. మేము సంతోషంగా ఉన్నాము. ఇది మాకు జీవితంలో ఒకసారి లభించే అవకాశం” అని అన్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...