అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా అడిషనల్ కలెక్టర్ సీసీ కారు (Additional Collector CC car) బోల్తా పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు, పలువురు గాయాలపాలయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ (Additional Collector Chander Nayak) సీసీ రాజశేఖర్ (CC Rajasekhar) తన కుటుంబీకులతో కలిసి కారులో నాచారం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా భిక్కనూరు మండలం బస్వాపూర్ సమీపంలో ఎదురుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో కారును తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో రాజశేఖర్ భార్య నిహారిక, కుమారులు అద్వైత్, ఆరుస్, స్నేహితుడు మోహన్, అతని కుమారుడు అగస్యలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గమనించి తన కారులో క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.